అమర్ అక్బర్ ఆంటోని పై రవితేజ ఘాటు సెటైర్లు

0
98

బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఆహ యాప్ లో అదరకొడుతుంది. మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలయ్య టైమింగ్, కామెడీ, సెన్స్ అఫ్ హ్యూమర్, ఈజ్ అన్నీ అదుర్స్.
రీసెంట్ గా బాలయ్య బాబు షో కి మాస్ మహారాజ్ రవితేజ వచ్చారు. ఇద్దరు మాస్ హీరోలు, టాప్ హీరోలు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటె ఎలా ఉంటది ??? రచ్చ రంబోలానే కదా! అదిరిపోయింది

ఇక మేటర్ కి వస్తే.. మాటల్లో బాలయ్య రవి తేజ పిక్ ఒకటి చూపించి అది ఎక్కడ దిగింది అని అడిగాడు…దానికి రవి తేజ “అప్పట్లో నేను ఓ కళాఖండంలో నటించాను. అది అమర్ అక్బర్ ఆంటోని. మీరు చూడలేదా ??? ఎం పర్లేదు. చాలా మంచి పని చేసారు. చూడనవసరం లేదు. మీరేం మిస్ అవ్వలేదు. ” అని సెటైర్లు వేశారు.

బాలయ్య బాబు రాడ్డా అని అడుగుతాడు? దానికి రవితేజ మామూలు రంబోలా కాదు. రాడ్ రంబోలా అని అన్నాడు. బాలయ్య రవితేజ పగలబడి నవ్వారు.

సినిమా నిజంగానే రాడ్ రంబోలా మూవీ కానీ ఒక పాపులర్ షో లో దాని గురించి హేళన చేసి మాట్లాడం అవసరం లేదు కదా. శ్రీను వైట్ల గతం లో రవి తేజ కి ఒక కల్ట్ క్లాసిక్ కామెడీ మూవీ ఇచ్చాడు (వెంకీ). దుబాయ్ శీను కూడా తక్కువ సినిమా ఎం కాదు. శ్రీను వైట్ల చూస్తే ఇబ్బంది పడక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here