ఒక్క తెలుగు ప్రజలే కాకుండా యావత్తు భారతదేశ ప్రజలు చాల ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్. ఆర్. ఆర్. బాహుబలి తర్వాత జక్కన దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ బాహుబలి తర్వాత మరో సారి టాలీవుడ్, తెలుగు సినిమా ప్రేక్షకులు కాలర్ ఎగరవేసే టైం వచ్చింది.
అయితే కరోనా కారణంగా చాల సార్లు పోస్ట్ పోన్ అయినఈ సినిమా ఎట్టకేలకి జనవరీ 7 న రిలీజ్ చేస్తునట్టు అనౌన్స్ కూడా చేసారు. దీనికోసం వెంకటేష్ F3 , పవన్ కళ్యాణ్ (భీమ్లా నాయక్) కూడా సంక్రాతి రేస్ నుండి తప్పుకున్నాయి. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం వలన ఆర్.ఆర్.ఆర్ సినిమా ని వాయిదా చేస్తునట్టు సినిమా టీం ట్విట్టర్ వేదిక ద్వారా అనౌన్స్ చేసారు.
సినిమా బాగుంటే తగ్గేదే లే, ఎన్ని అడ్డంకులు ఉన్నా థియేటర్ కి వచ్చి సినిమా చూస్తాము అని తెలుగు ప్రేక్షకులు చాలా సార్లు ప్రూవ్ చేసారు. క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు, వకీల్ సాబ్, sr కల్యాణమండపం, రాజ రాజ చోర, లవ్ స్టోరీ, అఖండ, పుష్ప వంటి సినిమాలు ఎట్లా దుమ్ము లేపాయో మనకి తెలుసు. ఆర్. ఆర్. ఆర్ విషయం లో కూడా జనాలు ఇలానే వరద లా థియేటర్స్ కి ప్రవహించేవాళ్లేమో!