కడశీల బిర్యాని అనే తమిళ్ సినిమా నెట్ఫ్లిక్ లో రిలీజ్ అయ్యింది. ఇదొక చిన్న సినిమా, విజయ్ సేతుపతి లాంటి పెద్ద స్టార్ ఈ సినిమా ని ప్రెసెంట్ చేసాడు, వాయిస్ ఓవర్ ఇచ్చాడు అలానే….ఇంక వద్దు సినిమా చూడండి.

ఇదొక రా, రస్టిక్, రివెంజ్ ప్లాట్ ఉన్న సినిమా. కొత్త దర్శకుడు నిశాంత్ దీనిని సింపుల్ గా, చాల శ్రద్ద తీసుకొని, చాలా ప్యాషన్ తో. చాలా అందంగా, నీట్ గా తీసాడు. ఒక చిన్న పాయింట్ తీసుకొని దానిని చాలా ఎంగేజింగ్ గా చెప్పాడు. సినిమా చూస్తున్నంత సేపు ఒక సస్పెన్స్ ఉంటుంది…అనుకోని మలుపులు తో కథ ముందుకి వెళ్తూ ఒక అర్థవంతంగా ముగుస్తుంది. ఈ సినిమా ఒకరకంగా ఆర్ట్ సినిమా అని చెప్పలేము అలా అని ఒక కమర్షియల్ సినిమా అని కూడా చెప్పలేం. ఒక మంచి కథ ని డైరెక్టర్ బాగా చెప్పాడు.

కథ: కథ విషయానికి వస్తే చాలా సింపుల్. ముగ్గురు అన్నతమ్ముళ్లు తన తండ్రి ని చంపిన వాడిని చంపేయడానికి స్కెచ్ వేసి బయలుదేరతారు. ఆ ముగ్గురిలో చివర వాడైనా చిక్కు పాండి కి ఈ మర్డర్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నాన్న చిక్కు పాండి ని చాల సున్నితం గా గొడవలకి దూరం గా పెంచుతాడు. కానీ అన్నయలిద్దరూ బలవంతంగా హత్య చేయడానికి తీసుకెళ్తారు. అలా ముగ్గురు కలిసి వాళ్ళ నాన్న ని చంపిన వాళ్ళను చంపడానికి వెళ్లినపుడు అక్కడ అనుకోని సంఘటనలు జరిగి, కథ అనుకోని మలుపులు తీసుకుంటుంది. ఇంతకీ అసలు వాళ్ళ ముగ్గురు వాళ్ళ నాన్న ని చంపిన వాడిని చంపుతారా ??? మూడోవాడైన చిక్కు పాండి ఎం చేస్తాడు ?? అన్నలకి సపోర్ట్ చేస్తాడా ??? చేయడా ??? ఇవన్నీ తెసులుకోవాలంటే మీరు సినిమా చూడండి. మీకు నచ్చుది అని అనుకుంటున్నాను.

ఈ సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయ్. అవేంటంటే..ఒకటి మ్యూజిక్, కెమెరా వర్క్, దర్శకత్వ ప్రతిభ, టైట్ స్క్రీన్ ప్లే.
మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన మెదడు కి చాల పని పెట్టాడు, మ్యూజిక్ తో కథ ని ఎంగేజింగ్ చేసాడు, కెమెరా వర్క్ చాల సింపుల్ గా ఉంది. కానీ బాగుంది. కథ ని బాగా చెప్పడానికి ఎవరికీ వారు బాగా కృషి చేశారు.

ఇక ఈ సినిమా లో చిన్న సర్ ప్రైస్ ఉంది.అదేంటో తెల్సుకొవాలంటే మీరు తప్పకుండా నెట్ ఫ్లిక్ కి వెళ్లి కడశీల బిర్యాని సినిమా ని కచ్చితంగా చూసేయాల్సిందే.

సినిమా: కడశీల బిర్యాని
స్ట్రీమింగ్ పార్టనర్: నెట్ ఫ్లిక్
డైరెక్టర్: నిశాంత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here